హ‌రీష్ శంక‌ర్ కొత్త ప్రాజెక్ట్ ‘వేదాంతం రాఘవయ్య’

|

Aug 31, 2020 | 2:02 PM

అలనాటి సినిమా ప్రముఖుడు వేదాంతం రాఘవయ్య పేరుతో సినిమా రాబోతోంది. అయితే ఇదేమీ బయోపిక్ కాదు. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ఈ చిత్రంలో సునీల్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడు. ఇలాంటి సినిమాకు కథ మాటలు అందిస్తున్నది మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమాకి...

హ‌రీష్ శంక‌ర్ కొత్త ప్రాజెక్ట్ వేదాంతం రాఘవయ్య
Follow us on

Harish Shankar : మాస్ ప‌ల్స్ తెలిసిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్…. ఇటీవ‌ల గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అలరించాడు. ప్ర‌స్తుతం ఓ  సినిమాకు క‌థ‌, మాటలు అందించ‌డంతో పాటు స‌మ‌ర్పిస్తున్నారు.

ఆ సినిమా మ‌రెదో కాదు.. అలనాటి సినిమా ప్రముఖుడు వేదాంతం రాఘవయ్య పేరుతో సినిమా రాబోతోంది. అయితే ఇదేమీ బయోపిక్ కాదు. ఈ చిత్రంలో సునీల్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడు. ఇలాంటి సినిమాకు కథ మాటలు అందిస్తున్నది మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడిగా హరీష్ శంకర్ శిష్యుల్లో ఒకరిని పరిచయం చేసే అవకాశం వుంది. ఈ రోజు మంచి రోజు అని సినిమాను ప్రకటించారు. త్వరలో అన్నీ ఫిక్స్ అయిన తరువాత మరిన్ని వివరాలు అందిస్తారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తారు.  హరీష్ శంకర్ తో కలిసి 14రీల్స్ ప్లస్ పతాకంపై వాల్మీకి నిర్మించారు. ఇది మళ్లీ అదే కాంబినేషన్లో మరో సినిమా.