కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ రాజీనామా?

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2019 | 7:05 PM

కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘెర పరాజయం పొందడంతో దానికి నైతిక బాధ్యత వహిస్తూ.. అస్సాం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా పని చేస్తున్నారు. 14 లోక్‌సభ స్థానాలు ఉన్న అస్సాంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమతమైంది. కాగా… […]

కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ రాజీనామా?
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘెర పరాజయం పొందడంతో దానికి నైతిక బాధ్యత వహిస్తూ.. అస్సాం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా పని చేస్తున్నారు. 14 లోక్‌సభ స్థానాలు ఉన్న అస్సాంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమతమైంది.

కాగా… తన రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించి.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని నియమించాలంటూ రాహుల్ గాంధీ తమ పార్టీ నేతలకు రాసిన బహిరంగ లేఖలో కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాసిన అనంతరం హరీష్ రావత్ తన పదవికి రాజీనామా చేయవడం గమనార్హం.