దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ వాసి.. మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం స్వగ్రామానికి..
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో దుబాయ్‌లో మృతి చెందిన తెలంగాణ వాసి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన రాజన్న ...
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో దుబాయ్‌లో మృతి చెందిన తెలంగాణ వాసి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండాకు చెందిన హరిలాల్ అనే వ్యక్తి జనవరి 31న గుండెపోటుతో మరణించాడు. అయితే మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి దుబాయ్‌లోని ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి చేరేలా ఏర్పాట్లు చేశారు. దీంతో శనివారం హరిలాల్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచిచి లొద్దితండాకు తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా మంత్రి ఏర్పాటు చేశారు. దీంతో హరిలాల్ కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.