Crime: పసిపాపపై పైశాచికత్వం…

|

Feb 24, 2020 | 8:16 PM

పసిపాప పై పైశాచికత్వం… మనిషిలోని మానవత్వం అంతరించిపోతోంది. క్షణికావేశాలతో సహనం కోల్పోతున్న మనషులు..విచక్షాణరహితంగా ప్రవర్తిస్తున్నారు. కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన చిన్నారుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పసివాళ్ల పట్ల పగలు, ప్రతీకారాలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ చిన్నారిపట్ల పెంపుడు తల్లిదండ్రులు దాష్టీకం ప్రదర్శించారు. నగరంలోని కాచీగూడా పోలీస్ స్టేషన్ పరిధి తిలక్ నగర్ ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న ఓ దంపతులు ఏడేళ్ల పాప ను దత్తత తీసుకున్నారు. ప్రేమను పంచాల్సిన […]

Crime: పసిపాపపై పైశాచికత్వం...
Follow us on

పసిపాప పై పైశాచికత్వం…
మనిషిలోని మానవత్వం అంతరించిపోతోంది. క్షణికావేశాలతో సహనం కోల్పోతున్న మనషులు..విచక్షాణరహితంగా ప్రవర్తిస్తున్నారు. కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన చిన్నారుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పసివాళ్ల పట్ల పగలు, ప్రతీకారాలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ చిన్నారిపట్ల పెంపుడు తల్లిదండ్రులు దాష్టీకం ప్రదర్శించారు.

నగరంలోని కాచీగూడా పోలీస్ స్టేషన్ పరిధి తిలక్ నగర్ ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న ఓ దంపతులు ఏడేళ్ల పాప ను దత్తత తీసుకున్నారు. ప్రేమను పంచాల్సిన ఆ దంపతులిద్దరూ చిన్నారిపై పైశాచికం ప్రదర్శించారు. బాలికతో వెట్టిచాకిరి చేయించారు. అంతేకాదు, నోటికి వచ్చినట్లుగా తిట్టటం, ఒళ్లు హూనం అయ్యేలా కొట్టడం, తాళ్లతో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు. పాప పట్ల పెంపుడు తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్న తీరును స్థానికులు గమనించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో వారు కాచీగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చైల్డ్ లేబర్ సహాయంతో పాపను కాపాడారు. ఒంటినిండా గాయాలతో వున్న చిన్నారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఏడేళ్ల చిన్నారి పట్ల అంత్యంత కిరాతకంగా ప్రవర్తించిన పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.