నాన్న‌..నిన్ను న‌డిపిస్తాడు..నీడై కాపు కాస్తాడు..

|

Jun 21, 2020 | 3:14 PM

జీవితంలో ఇక ఈ క‌ష్టం నుంచి పైకి రాలేన‌కున్న‌ప్పుడు నాన్న‌కు ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడినా..నిశ్శ‌బ్దంగా ఆయ‌న మోమువైపు కొన్ని క్ష‌ణాలు చూసినా కొండంత ధైర్యం ల‌భిస్తుంది.

నాన్న‌..నిన్ను న‌డిపిస్తాడు..నీడై కాపు కాస్తాడు..
Follow us on

జీవితంలో ఇక ఈ క‌ష్టం నుంచి పైకి రాలేన‌కున్న‌ప్పుడు నాన్న‌కు ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడినా..నిశ్శ‌బ్దంగా ఆయ‌న మోమువైపు కొన్ని క్ష‌ణాలు చూసినా కొండంత ధైర్యం ల‌భిస్తుంది. అవును ఆయ‌న గ‌గ‌నంలా ఎక్క‌డికి వెళ్లినా మ‌న‌తోనే ఉంటాడు. నిరంత‌రం మ‌న‌ల్ని కాపు కాస్తూనే ఉంటాడు. అన్నీ అమ్మ‌ని అడిగి..”నాన్నా..అమ్మెక్క‌డ” అనే ఒకే ఒక్క ప్ర‌శ్న అడిగినా ఆయ‌న ఇసుమంత కూడా ఫీల్ కాడు. ఆయ‌న మ‌న వెనుక ఉండి న‌డిపిస్తూ..వెనుకే ఆగిపోయాడు. మ‌నం ఎంత ముందుకు వెళ్లినా..ఆయ‌న మాత్రం వెనుకే ఉండిపోతున్నాడు. బొమ్మ‌లు కావాల‌ని మారాం చేసిన‌ప్ప‌టి నుంచి బ్ర‌తుకు బండి స‌రిగ్గా న‌డ‌వ‌ప్ప‌టివ‌ర‌కు ఆయ‌నే ఆధారం. మ‌న ర‌క్తంలో నాన్న‌. ఓటమిలో ఓదార్పు నాన్న‌..గెలుపులో ధైర్యం నాన్న‌. బ‌డికి వెళ్ల‌క‌పోతే బాదింది నాన్న‌..గొప్పు కొలువు చేస్తుంటే మురిసింది నాన్న. జీవితాన్నంత బిడ్డ‌ల‌కే అంకితం చేసిన పిచ్చిమారాజు నాన్న. జీవితాన్నే ఇచ్చిన నాన్నకి ఓ రోజు ఇచ్చాం..ఎంతైనా గొప్ప‌వాళ్లం. అదీ లేక‌పోతే ఆ రోజు కూడా ఆయ‌న్ని ప‌ట్టించుకోని వెర్రిబాగులోళ్లం. నాన్న క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ఇచ్చే బిడ్డ‌లు ఉండ‌టం గొప్ప విష‌యం. ఆయ‌న్ని వంతులు వేసి పంచుకునేంత దిగ‌జారిపోవ‌డం అత్యంత బాధాక‌రం. చిన్న‌ప్పుడు నిన్ను ఆయ‌న‌ భుజం మీద మోసిన ఙ్ఞాపకాలు గుర్తు తెచ్చుకో…గుండె బ‌రువుతో మ‌న‌సారా ఒక్క‌సారి నాన్న‌ని కౌగిలించుకో. టీవీ9 పాఠ‌కుల‌కు ఫాథ‌ర్స్ డే శుభాకాంక్ష‌లు.