అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ సినిమాలలోని అగ్రహీరోల సరసన నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ. అటు ఓ వైపు సినిమాలు చేస్తునే వెబ్ సీరిస్‌లోకి కూడా అడుగు పెట్టబోతుంది హన్సిక. త్వరలోనే హన్సిక నటించిన వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రాబోతున్నట్లుగా సమాచారం. కాగా గతంలో భాగమతి, పిల్లా జమీందార్ సినిమాలను డైరెక్ట్ చేసిన జి.అశోక్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు నషా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో యూత్ ఫుల్ కథతో ఈ వెబ్ సిరీస్ సాగనుంది. ఇందులో దాదాపు 10 ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగులోనే కాకుండా అటు తమిళ్, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.