Half Day Schools: ఏపీలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వి. చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయన్న ఆయన.. అనుసరించాల్సిన విధులను పేర్కొంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు.
హాఫ్ డే స్కూల్స్ నేపథ్యంలో ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరగనున్నాయి. ఏప్రిల్ రెండో శనివారం పాఠశాలలు పని చేయాలని ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నీటిని అందుబాటులో ఉంచాలన్నారు.
అలాగే తరగతులను ఆరు బయట లేదా చెట్టు కింద గానీ నిర్వహించరాదని తెలిపారు. అటు విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా స్కూళ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేయాలన్నారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనాన్ని హాఫ్ డే స్కూల్స్ సమయం అయ్యేసరికి తయారు చేసి విద్యార్థులకు అందించాలన్నారు. కాగా, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనుండగా.. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని వెల్లడించారు.
For More News:
కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..
కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..
సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…
పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…
మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?