దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పెరగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రుల సైతం సరిపోవడంలేదు. దీంతో అందుబాటులో ఉన్న భవనాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గువాహటి సెంట్రల్ జైలు వార్డును కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా బారిన పడిన ఇద్దరు ఖైదీలు కొవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతూ తప్పించుకొని పారిపోయారు. ఈ నేపథ్యంలో గువాహటి సెంట్రల్ జైలు వార్డును కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని అదికారులు నిర్ణయించారు. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు సైతం కరోనా బారిన పడుతున్నారు. పౌరసత్వ వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన అఖిల్ గొగోయ్ అతని బృందం సభ్యులు, మణిపూర్ ఉగ్రవాద నాయకులు ఈ జైలులో ఉన్నారు. గొగోయ్ కు కరోనా సోకడంతో అతన్ని గువాహటిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇద్దరు ఖైదీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయారు. దీంతో గువాహటి సెంట్రల్ జైలులోని ఒక వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ జైలు కొవిడ్ ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించారు. అసోంలో 31 జైళ్లు ఉండగా, 481 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఖైదీలకు కరోనా సోకిన నేపథ్యంలో జైలు వార్డునే కొవిడ్ కేంద్రంగా మార్చామని అధికారులు చెప్పారు. కరోనా లక్షణాలు లేని ఖైదీలకు కూడా జైలు కొవిడ్ సెంటర్ చికిత్స అందిస్తామని అధికారులు వెల్లడించారు.