తెలుగురాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పుష్ప, దీపాలంకరణలతో సాయిబాబా ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సాయిబాబాను దర్శించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్నారు. సాయినామస్మరణతో పలు ఆలయాలు మార్మోగుతున్నాయి. శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో జరుగుతున్న వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.