Gurthunda Seethakalam: సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తోన్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్. స్వీయ నిర్మాణంలో నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాగా.. దీని రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని అప్పట్లో చిత్ర యూనిట్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా హీరో సత్యదేవ్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. చిత్రం ఆగిపోలేదని స్పష్టం చేశాడు. త్వరలోనే షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపాడు.
Also Read:
NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!