AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి

అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది..మొన్నటి వరకు కాసింత తగ్గినట్టే అనిపించిన కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది..

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి
Balu
|

Updated on: Oct 30, 2020 | 4:34 PM

Share

అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది..మొన్నటి వరకు కాసింత తగ్గినట్టే అనిపించిన కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది.. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.. కరోనా వైరస్‌ వ్యాప్తి అమెరికన్లను ఆందోళనకు గురి చేస్తుందే తప్ప అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.. పరిస్థితులు సాధారణస్థితికి వస్తున్నాయంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. గత 24 గంటల్లో 91 వేల కొత్త కేసులు నమోదయ్యాయని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ లెక్కలు వేసి మరీ చెబుతోంది. వీటిని కలుపుకుంటే అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య సుమారు 90 లక్షలకు చేరుకుంది.. వెయ్యి మందికిపైగా కరోనా బలి తీసుకుంది.. ఇప్పటి వరకు అమెరికాలో 2,28,625 మంది కరోనా సోకి మరణించారు. ప్రపంచంలోనే ఎక్కువ కోవిడ్‌ కేసులున్నది అమెరికాలోనే! అలాగే ఎక్కువ మరణాలు కూడా ఇక్కడే సంభవించాయి. నెల కిందటి వరకు కరోనా అక్కడ తగ్గుముఖం పట్టింది.. అయితే పక్షం రోజుల నుంచి కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టాయి. రెండు వారాల కిందట రోజుకు సగటున 52 వేల కేసులు నమోదయితే ఇప్పుడది 74 వేలకు చేరింది.. 15 రాష్ట్రాలలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.. 45 రాష్ట్రాలలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. ఇంత జరుగుతున్నా ట్రంప్‌ మాత్రం కరోనా తీవ్రత ఏమీ లేదంటున్నారు.. నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆరోగ్య అధికారులు మాత్రం కరోనా వ్యాప్తి భయంకరంగా ఉందంటున్నారు. ప్రజలంతా అప్రమత్తతతో మెలగాలని సూచిస్తున్నారు.

Follow Us
వివో T5 ప్రో vs వన్‌ప్లస్‌ నార్డ్‌ 6.. ఏది కొనాలి?
వివో T5 ప్రో vs వన్‌ప్లస్‌ నార్డ్‌ 6.. ఏది కొనాలి?
విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ్.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం..
విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ్.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం..
స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో వీసీ సజ్జనర్ ఆకస్మిక తనిఖీలు
స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో వీసీ సజ్జనర్ ఆకస్మిక తనిఖీలు
పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు
పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు
బరువు తగ్గాలనుకునే వారికి ఈ మొలకలు వరం
బరువు తగ్గాలనుకునే వారికి ఈ మొలకలు వరం
EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో