జిల్లా కోర్టులో సమావేశమైన లాయర్లు.. స్వల్ప తోపులాట, గుంటూరు జిల్లాలో తెరపైకి కొత్త వివాదం.!

|

Dec 18, 2020 | 2:47 PM

గుంటూరు జిల్లాలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జిల్లా కోర్టులో సమావేశమైన లాయర్లు...ఏపీ హైకోర్టు అమరావతిలోనే ఏర్పాటు చేయాలని..

జిల్లా కోర్టులో సమావేశమైన లాయర్లు.. స్వల్ప తోపులాట, గుంటూరు జిల్లాలో తెరపైకి కొత్త వివాదం.!
Follow us on

గుంటూరు జిల్లాలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జిల్లా కోర్టులో సమావేశమైన లాయర్లు…ఏపీ హైకోర్టు అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తు ఓ వర్గం లాయర్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి మరోవర్గం న్యాయవాదులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కోర్టు ముందే కించపరిచేలా మాట్లాడుతారా అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. వివాదం చెలరేగే సమయంలో అక్కడే ఉన్న మరికొందరు లాయర్లు రెండు వర్గాల వారిని అడ్డుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. రాజధాని మార్చవద్దని రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాది పూర్తైందో లేదో… ఇప్పుడు అమరావతి ప్రాంత లాయర్లు కొందరు హైకోర్టును మార్చడానికి వీల్లెదంటూ తమ స్వరాన్ని వినిపిస్తుండటం విశేషం.