కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో
కేబినెట్ సమావేశానికి మాస్క్ ధరించకుండా వచ్చారంటూ మంత్రికి 200 రూపాయల జరిమానాను విధించారు. అహ్మదాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి మాస్క్ ధరించకుండా వచ్చారంటూ మంత్రి ఈశ్వరీసిన్హ పటేల్‌కు అధికారులు జరిమానా విధించారు. ఈయన తప్ప మిగితా మంత్రులు అందరు కూడా మాస్కులతో విధిగా హాజరయ్యారు.
కాగా.. ఈశ్వర సిన్హా మాస్క్ లేకుండా వచ్చారంటూ స్థానిక టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆయనకు 200 రూపాయల జరిమానా విధించారు. కేబినెట్ సమావేశం పూర్తి కాగానే… పటేల్ ఆ జరిమానాను చెల్లించినట్లు రశీదును చూపించారు. ‘‘మాస్క్ ధరించని కారణంగా నేను 200 రూపాయల జరిమానా చెల్లించాను. ఎప్పుడూ మాస్క్ ధరించే ఉంటా. కారు దిగే సమయంలో మరిచిపోయా. తర్వాత నా తప్పును తెలుసుకున్నా’’ అని ఈశ్వర సిన్హా పటేల్ పేర్కొన్నారు.