అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన జీవరాసులు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. తాజాగాగుజరాత్‌లోని వడోదరాలో రోడ్డుపక్కన ఓ మొసలి కలకలం సృష్టించింది. దాదాపు ఐదు అడుగుల పొడవున్న ఓ మొసలి ఆదివారం గ్రామంలో దర్శనమిచ్చి స్థానికులను షాక్‌కు గురిచేసింది. వడోదరలోని కళా భవన్‌కు సమీపంలో రాజ్‌మహల్ రోడ్డు పక్క బాటసారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్ కింద ఓ మొసలి నక్కింది. అటు వైపుగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి కండపడింది ఈ మొసలి. దీంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో గుజరాత్ సొసైటీ ఫర్ ప్రొవెన్షన్ ఆఫ్ క్యుయాల్టీ టు అనిమల్స్ వాలంటీర్లు ఆ మొసలిని బంధించారు. వాలంటీర్లు దాన్ని బంధించి స్థానిక మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
#WATCH Gujarat: A crocodile being rescued by the officials of the Gujarat Society for Prevention of Cruelty to Animals (GSPCA) from a residential area in Vadodara. pic.twitter.com/3sRcEXhL25
— ANI (@ANI) August 16, 2020
రాత్రి వేళ సమీపంలోని విశ్వమిత్ర నది నుంచి బయటకొచ్చి…రోడ్డుపై పాకుతూ అక్కడికి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. జనావాసాల మధ్యలోకి మొసళ్లు వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నీటి కుంటలను ఆవాసంగా మార్చుకున్న మొసళ్లు…భారీ వర్షాలు, వరదల కారణంగా ఇలా బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.