గుడివాడ : ‘ఉల్లి’ మిగిల్చిన విషాదం..ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

| Edited By: Srinu

Dec 09, 2019 | 1:57 PM

దేశంలో ఉల్లి కష్టాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తోన్న కొరత పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉల్లిని దిగుమతి చేసుకొని అమ్మకాలు జరుపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా అటువంటి చర్యనే ప్రారంభించింది. రైతు బజార్ల ద్వారా కేజీ రూ.25 ఉల్లిని విక్రయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లకు ప్రజలు క్యూ కడుతున్నారు. పెరిగిన ఉల్లి డిమాండ్ ప్రజల ప్రాణాలు తీసే వరకు వెళ్తుంది. నేడు కృష్ణా జిల్లాలోని […]

గుడివాడ : ఉల్లి మిగిల్చిన విషాదం..ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
Follow us on

దేశంలో ఉల్లి కష్టాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తోన్న కొరత పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉల్లిని దిగుమతి చేసుకొని అమ్మకాలు జరుపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా అటువంటి చర్యనే ప్రారంభించింది. రైతు బజార్ల ద్వారా కేజీ రూ.25 ఉల్లిని విక్రయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లకు ప్రజలు క్యూ కడుతున్నారు.

పెరిగిన ఉల్లి డిమాండ్ ప్రజల ప్రాణాలు తీసే వరకు వెళ్తుంది. నేడు కృష్ణా జిల్లాలోని రైతు బజార్లలో ప్రభుత్వం ఉల్లి అమ్మకాలు జరుపుతోంది. దీంతో జనం బారులు తీరారు. అయితే  గుడివాడ రైతు బజారులో ఉల్లిపాయల కోసం క్యూలైన్‌లో నిల్చున్న… సాంబయ్య అనే వ్యక్తి  హఠాన్మరణం చెందాడు. ఈ రోజు ఉదయం నుంచి అతను ఉల్లి కొనుగోలుు చేసేందుకు క్యూ లైన్‌లోనే ఉన్నాడు. ఎండ పెరగడం, పెద్ద వయసు కావడంతో..ఒక్కసారిగా కూలిపోయాడు.  వెంటనే అప్రతమత్తమైన స్థానికులు అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.