గ్రేటర్‌లో ఇంటింటికీ జీరో వాటర్ బిల్లు.. ఉచితం తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

|

Jan 12, 2021 | 12:39 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలో భాగంగా ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

గ్రేటర్‌లో ఇంటింటికీ జీరో వాటర్ బిల్లు.. ఉచితం తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Follow us on

GHMC free water scheme : గ్రేటర్ వాసులకు తెలంగాణ సర్కార్ అందిస్తున్న కానుకను రాష్ట్ర మంత్రి కేటీ.రామారావు ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మహానగరంలోని రెహమత్‌నగర్‌లో ఉచిత తాగు నీరు పథకాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం రెహమత్ నగర్‌లో ఇంటింటికీ జీరో వాటర్ బిల్లులను పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలో భాగంగా ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

గ్రేటర్ హైద్రాబాద్‌ పరిధిలో 10 లక్షల 8 వేల నల్లా కనెక్షన్లకు ఉచిత తాగునీరును అందివ్వనుంది జలమండలి. ఈ పథకంతో గ్రేటర్‌లో 97 శాతం మందికి లబ్ది చేకూరనుంది. ఉచిత తాగు నీరు కావాలంటే మార్చి 31 లోపు తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. స్లమ్, బస్తీ ప్రజలకు కొత్త మీటర్ అవసరం లేదని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. అయితే, 20 వేల లీటర్లు దాటితే బిల్లు కట్టాల్సి ఉంటుంది. 10 లక్షల 8 వేల నల్లా కనెక్షన్లకు ఫ్రీ వాటర్ ఇవ్వడం ద్వారా నెలకు రూ.19 కోట్ల 92 లక్షల ఆదాయాని జలమండలి కోల్పోనుంది.