Grammy Awards 2021: గ్రామీ అవార్డులకు తప్పని కరోనా సెగ.. వాయిదా వేస్తూ నిర్ణయం..

|

Jan 06, 2021 | 11:13 AM

Grammy Awards postponed: కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటికి కనిపించని వైరస్..

Grammy Awards 2021: గ్రామీ అవార్డులకు తప్పని కరోనా సెగ.. వాయిదా వేస్తూ నిర్ణయం..
Follow us on

Grammy Awards postponed: కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటికి కనిపించని వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం గడగడలాడిపోయింది. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. కొన్నయితే రద్దు అయ్యాయి. ఇక ప్రస్తుతం పరిస్థితులు కాస్త సర్దుకుంటున్నాయన్న సమయంలో బ్రిటన్‌ కేంద్రంగా పుట్టుకొచ్చిన స్ట్రెయిన్‌ కరోనా మళ్లీ అలజడి రేపుతోంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా వెళుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలోనూ పరిస్థితుల మళ్లీ చేయి దాటుతోన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేశారు. జనవరి 31న జరగాల్సిన ఈ అవార్డు వేడుకలను వాయిదా వేశామని గ్రామీ అవార్డు నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పరిస్థితులు మెరుగయ్యాక మార్చి 14న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుండగా ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ‘గ్రామీ’ అవార్డులను సంగీత రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అందిస్తుంటారు.

Also Read: Yuganiki Okkadu Update: చోళ వారసుడిగా కనిపించినున్న ధనుష్‌… ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘యుగానికి ఒక్కడు 2’ వార్త..