మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ

ఏపీలో వాలంటీర్ల సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో వారు కీలకంగా పనిచేశారు. కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో సాయపడ్డారు.

మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ
Follow us

|

Updated on: Dec 12, 2020 | 5:55 PM

ఏపీలో వాలంటీర్ల సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో వారు కీలకంగా పనిచేశారు. కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో సాయపడ్డారు. ఇక పెన్షన్లు సమయానికి అందించడం సహా ఇతర ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి వాలంటీర్లు చేసిన సాయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. గర్భిణి డోలీలో 7 కి.మీ. మోసుకుంటూ 108 వాహనం వరకు తీసుకొచ్చారు వాలంటీర్లు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది. గొల్లుపాలెం పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన ఏర్రోడ్ల పాలేనికి చెందిన గిరిజన మహిళ పంగి జానకమ్మకు శుక్రవారం సాయంత్రం సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆమె భర్త కామేశ్‌ 108కి ఫోన్‌ చేయగా వెళ్లడానికి సరైన మార్గం లేక వాహనం మధ్యలోనే ఆగిపోయింది.

విషయం తెలియడంతో పంచాయతీ కార్యదర్శి గంధవరపు కృష్ణ  తన బైక్‌ను గ్రామానికి పంపించగా గర్భిణి దానిపై కూర్చోలేకపోయింది. దీంతో గ్రామ వాలంటీర్లు బాలాజీ, శ్రీహర్ష డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లుపాలెం గ్రామానికి డోలీలో మోసుకుంటూ తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో గజపతినగరం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేవరకూ ఏఎన్‌ఎం మమతావల్లి, ఆశ కార్యకర్త గర్భిణికి వెన్నంటే ఉండి సపర్యలు చేశారు. వాలంటీర్లతో పాటు ఆరోగ్య కార్యకర్తలు చూపిన ఆదరణకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : 

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, బాంబులా పేలిన రియాక్టర్

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి