భావోద్వేగానికి గురైన గవర్నర్ నరసింహన్..! పూజారిగా మారతానేమో..!

| Edited By:

Sep 03, 2019 | 8:57 PM

పదేళ్లపాటు నేను గవర్నర్‌గా ఉంటానని అనుకోలేదని.. నన్ను ఆదరించినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నరసింహన్. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం చెన్నైలోని నివాసంలోనే ఉంటానని చెప్పారు. వడ సాంబార్ తింటూ.. కాలక్షేపం చేస్తానని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కాగా.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు. అలాగే.. తనపై వచ్చిన కామెంట్స్‌కు సూటిగా.. జవాబిచ్చారు నరసింహన్. గుళ్లు, గోపురాలు […]

భావోద్వేగానికి గురైన గవర్నర్ నరసింహన్..! పూజారిగా మారతానేమో..!
Follow us on

పదేళ్లపాటు నేను గవర్నర్‌గా ఉంటానని అనుకోలేదని.. నన్ను ఆదరించినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నరసింహన్. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం చెన్నైలోని నివాసంలోనే ఉంటానని చెప్పారు. వడ సాంబార్ తింటూ.. కాలక్షేపం చేస్తానని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కాగా.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు.

అలాగే.. తనపై వచ్చిన కామెంట్స్‌కు సూటిగా.. జవాబిచ్చారు నరసింహన్. గుళ్లు, గోపురాలు తిరగడం నా వ్యక్తిగత జీవితమని అన్నారు. తనను పూజారిగా అభివర్ణించినందుకు ధన్యవాదాలని.. అయినా అంతకంటే భాగ్యం మరేముంటుందని తనదైన రీతిలో సెటైర్లు వేశారు. పదవీ విరమణ అనంతరం తాను పూజారిగా మారినా.. ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. తాను ఇప్పటివరకూ.. తిరుపతి, యాదాద్రి, భద్రాద్రి, ఖైరతాబాద్ ఆంజనేయ స్వామి ఆలయాలను మాత్రమే దర్శించుకున్న విషయం తెలిపారు. అలాగే.. నరసింహన్‌ను జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌గా నియమించిన విషయంపై కూడా స్పందించారు. అసలు నాకంటే.. ఈ వార్తలు మీకెలా ముందు తెలుస్తాయని ఛలోక్తులు విసిరారు తెలంగాణ గవర్నర్ నరసింహన్.