ఇకపై ప్రభుత్వ సేవలన్నీ గ్రామ సచివాలయాల్లోనే.!

|

Jan 27, 2020 | 5:54 AM

Government Services In AP Village Secretariats: ఇకపై పలు ధృవీకరణ పత్రాల కోసం మీ-సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉచితంగా పొందవచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకునేలా సేవా పట్టిక, తదితర ఏర్పాట్లన్నింటిని పూర్తి చేసింది. […]

ఇకపై ప్రభుత్వ సేవలన్నీ గ్రామ సచివాలయాల్లోనే.!
Follow us on

Government Services In AP Village Secretariats: ఇకపై పలు ధృవీకరణ పత్రాల కోసం మీ-సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉచితంగా పొందవచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకునేలా సేవా పట్టిక, తదితర ఏర్పాట్లన్నింటిని పూర్తి చేసింది. అంతేకాకుండా అత్యధిక సేవలను 72 గంటల్లోనే అందించేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉంటే రుసుము చెల్లించి పొందే సేవలను మరో 5 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 11 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం ఆలోచించగా.. ప్రస్తుతం 470 సేవలను అందించనున్నారు. మండల పరిషత్, పురపాలిక కార్యాలయాల్లో శిక్షణ పొందుతున్న ఉద్యోగులు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేయనున్నారు.

ఇక పింఛన్ల విషయానికి వస్తే.. ప్రస్తుత లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హుల జాబితాను.. అటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాక అభ్యంతరాలను నెలాఖరు వరకు  స్వీకరించి తుది జాబితాను రూపొందించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.