గోరంట్ల మాధవ్‌కు లైన్ క్లియర్.. రాజీనామాను వెంటనే ఆమోదించండి : ట్రైబ్యునల్ ఆదేశాలు

|

Mar 20, 2019 | 5:57 PM

గోరంట్ల మాధవ్ కు ఊరట లభించింది. మాధవ్ నామినేషన్ ను స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ట్రైబ్యునల్ ఆదేశించింది. వీఆర్ఎస్ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తును వెంటనే ఆమోదించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఆయన నామినేషన్ పై ఏర్పడిన సందిగ్దత తొలిగింది. కాగా టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించాడు గోరంట్ల మాధవ్. ఆయన తన ఉద్యోగానికి గతేడాది డిసెంబర్ 30న రాజీనామా ఇచ్చి […]

గోరంట్ల మాధవ్‌కు లైన్ క్లియర్.. రాజీనామాను వెంటనే ఆమోదించండి : ట్రైబ్యునల్ ఆదేశాలు
Follow us on

గోరంట్ల మాధవ్ కు ఊరట లభించింది. మాధవ్ నామినేషన్ ను స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ట్రైబ్యునల్ ఆదేశించింది. వీఆర్ఎస్ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తును వెంటనే ఆమోదించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఆయన నామినేషన్ పై ఏర్పడిన సందిగ్దత తొలిగింది.

కాగా టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించాడు గోరంట్ల మాధవ్. ఆయన తన ఉద్యోగానికి గతేడాది డిసెంబర్ 30న రాజీనామా ఇచ్చి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా ను ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. దీనితో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో వైసీపీ దీనిపై సీరియస్ గా ఆయన ప్లేస్ లో ఎవరిని నిలబెట్టాలని కూడా ఆలోచించింది. ఇప్పుడు ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో హిందూపురం వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.