ప్రముఖ రచయిత్రికి గూగుల్ ఘన నివాళి

| Edited By:

Aug 31, 2019 | 12:44 PM

ప్రముఖ రచయిత్రికి గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. పంజాబీకి చెందిన రచయిత్రి అమృత ప్రీతమ్‌ శతజయంతిని పురస్కరించుకొని సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ రూపొందించింది. ఆమె ఆత్మకథ “కాలా గులాబ్‌”ని గుర్తుచేసేలా ఈ డూడుల్‌ని తీర్చిదిద్దింది. కాలా గులాబ్‌ ఆత్మకథతో ఆమె జీవితంలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. వీటి స్ఫూర్తితో మహిళలు వారి సమస్యలపై గొంతు వినిపించడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రేమ, వివాహానికి సంబంధించి మహిళలు భయం లేకుండా మాట్లాడడానికి రచయిత్రి జీవిత […]

ప్రముఖ రచయిత్రికి గూగుల్ ఘన నివాళి
Follow us on

ప్రముఖ రచయిత్రికి గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. పంజాబీకి చెందిన రచయిత్రి అమృత ప్రీతమ్‌ శతజయంతిని పురస్కరించుకొని సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ రూపొందించింది. ఆమె ఆత్మకథ “కాలా గులాబ్‌”ని గుర్తుచేసేలా ఈ డూడుల్‌ని తీర్చిదిద్దింది. కాలా గులాబ్‌ ఆత్మకథతో ఆమె జీవితంలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. వీటి స్ఫూర్తితో మహిళలు వారి సమస్యలపై గొంతు వినిపించడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రేమ, వివాహానికి సంబంధించి మహిళలు భయం లేకుండా మాట్లాడడానికి రచయిత్రి జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తినిచ్చిందని సాహితీకారులు అభిప్రాయపడుతుంటారు.

స్వాతంత్ర్యం రాకముందు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న గుజ్రాన్‌వాలా ప్రాంతంలో అమృత ప్రీతమ్‌ జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది. సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తొలి మహిళగా అమృతి ప్రీతమ్‌ నిలిచారు. 1956 ఈ అవార్డు దక్కించుకున్నారు. అనంతరం 1981లో జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 2004లో పద్మ విభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఆమె రచించిన ప్రముఖ నవల “పింజర్‌”ను బాలివుడ్‌లో సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి దేశ సమైక్యతా విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు లభించింది. దేశ విభజన నేపథ్యంలో వచ్చిన నవలగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 100కు పైగా పుస్తకాలను ఆమె రచించారు. ఇటు భారత్‌తో పాటు అటు పాకిస్థాన్‌లోనూ ప్రీతమ్‌ రచనలకు అభిమానులున్నారు. కాగా, 1986లో అమృత ప్రీతమ్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2005 అక్టోబరు 31న అనారోగ్యంతో ప్రీతమ్‌ తుదిశ్వాస విడిచారు.