Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ సర్కార్.? అదేంటంటే.!!

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్రంలో సుమారు 402 గవర్నమెంట్..

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ సర్కార్.? అదేంటంటే.!!

Updated on: Dec 19, 2020 | 6:02 PM

Telangana Inter Students: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్రంలో సుమారు 402 గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో దాదాపు 1200 కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో పలు ప్రముఖ ఐటీ కంపెనీలు పాల్గొనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా సాఫ్ట్‌వేర్ సంస్థలు అంగీకారం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మరోవైపు వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కళాశాలలను తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వాటిపై సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఇటీవల కేంద్ర విద్యాశాఖ జేఈఈ మెయిన్ తేదీలను వెల్లడించడంతో.. విద్యార్థులకు కనీసం మూడు నెలల పాటు బోధన తప్పనిసరిగా ఉండాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ కాలేజీలను పున: ప్రారంభించేందుకు పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

Also Read:

సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..

డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?

తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..