Pan card: కార్డు వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌‌: కేవ‌లం 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..

|

Dec 25, 2020 | 8:58 AM

ఒకప్పుడు పాన్ కార్డు కావాలంటే దాదాపు నెల రోజుల స‌మ‌యం ప‌ట్టేది. కార్డును పొందాలంటే మీ సేవా కేంద్రాల‌కు వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. అలాంటి రోజులు పోయాయి. ...

Pan card: కార్డు వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్‌‌: కేవ‌లం 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..
Follow us on

ఒకప్పుడు పాన్ కార్డు కావాలంటే దాదాపు నెల రోజుల స‌మ‌యం ప‌ట్టేది. కార్డును పొందాలంటే మీ సేవా కేంద్రాల‌కు వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. అలాంటి రోజులు పోయాయి. పాన్ కార్డు కావాలంటే కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే పొందే సౌక‌ర్యం వ‌చ్చేంది. దీని కోసం పెద్దగా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా ఇంట్లోనే ఉండి ప‌ది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందే స‌దుపాయాన్ని కేంద్రం క‌ల్పించింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో మ‌న‌కు ఆధార్ కార్డు ఎంత ముఖ్య‌మో పాన్ కార్డు కూడా అంతే ముఖ్యం. ఈ రెండు లేకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జ‌రిపేందుకు అవ‌కాశం ఉండ‌దు. అందుకే ఆదాయ ప‌న్ను శాఖ త్వ‌రిత‌గ‌తిన పాన్‌కార్డు పొందేందుకు కొత్త సేవ‌ల‌ను ప్రారంభించింది. ప్ర‌స్తుతం కోవిడ్ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వెళితే ప్ర‌మాదం పొంచివుండే అవ‌కాశం ఉండ‌టంతో ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది కేంద్రం.

ఇన్‌స్టంట్ పాన్ సౌక‌ర్యం కింద ఆధార్ కార్డు ద్వారా ఇ-పాన్ కార్డు ఇవ్వ‌డానికి ప‌ది నిమిషాలు ప‌డుతుంద‌ని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఈ సౌక‌ర్యం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 7 ల‌క్ష‌ల పాన్ కార్డులు జారీ చేసిన‌ట్లు తెలిపింది. అలాగే పాన్ కార్డును ఎస్ ఎస్ డీఎల్‌, యూటీఐటీఎస్ఎస్ వెబ్ సైట్ల ద్వారా కూడా పొంద‌వ‌చ్చు. వీటి ద్వారా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆదాయ ప‌న్ను శాఖ పోర్ట‌ల్ ద్వారా అయితే పాన్ కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే ఎటువంటి రుసుము లేకుండా పొంద‌వచ్చు.

పాన్ ఎలా పొందాలి

మీరు ఆదాయ ప‌న్ను శాఖ పోర్ట‌ల్‌లో https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/లోకి వెళ్లి ఆధార్ నెంబ‌ర్, ఓటీపీ నెంబ‌ర్ ఓంట‌ర్ చేసి ఇకేవైసీ పూర్తి చేస్తే స‌రిపోతుంది. ఆ త‌ర్వాత మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో పాన్ కార్డు వ‌స్తుంది. అలాగే అందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోటో మొద‌లైన స‌మాచారంతో పాటు QR కోడ్ క‌లిగి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేయ‌డం పూర్త‌యిన త‌ర్వాత మీకు 15 అంకెల ర‌శీదు వ‌స్తుంది. దీని ద్వారా మీరు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.