Gold Sales Increasing: కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో గత కొన్ని రోజులుగా బంగారం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రజల ఆదాయాలు పడిపోవడం, ప్రజలు పొదుపు చర్యలు పాటించడం దీనికి కారణంగా నిపుణులు విశ్లేషించారు.
అయితే ప్రస్తుతం పరిస్థితులు క్రమేణా మారుతున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండడం వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుండడంతో మళ్లీ జన జీవనం పట్టాలెక్కుతోంది. ఈ తరుణంలోనే గత కొన్ని రోజులుగా వెలవెలబోయిన బంగారం విక్రయాలు మళ్లీ పుంజుకోనున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ క్రమంగా మెరుగుపడుతుడడం ఇందుకు ప్రధాన కారణమని డబ్ల్యూజీసీ తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది నవంబర్‌లో బంగారు ఆభరణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలీస్తే గణనీయంగా పెరిగిందని డబ్ల్యూజీసీ చెబుతోంది. ఇక కోవిడ్ టీకా పంపిణీతో మార్కెట్లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోనున్నాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్ సోమసుందరం తెలిపారు. కరోనా కారణంగా 2020లో వాయిదాపడిన పెళ్లి, పండగ కొనుగోళ్లతో ఈ ఏడాది ఆభరణాలకు గిరాకీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Oppo A93 5G Smartphone: మార్కెట్లోకి ఒప్పో ఎ93 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల.. 128జీబీ స్టోరేజీ