గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

| Edited By:

Mar 13, 2020 | 6:59 PM

పసిడి ప్రియులకు ఇది శుభవార్తే. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర.. శుక్రవారం భారీగా తగ్గింది. తాజాగా గత వారం రూ.45 వేల మార్కును దాటిన బంగారం.. క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శుక్రవారం స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలకు బ్రేకులు పడ్డట్లైంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించడంతో పాటు.. డాలరుతో రూపాయి విలువ బలపడటంతో.. ఢిల్లీలో ఫ్యూర్ గోల్డ్ (24 క్యారెట్స్) ధర.. రూ.1097 తగ్గి.. రూ.42,600కు చేరింది. అటు వెండి కూడా భారీగా […]

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Follow us on

పసిడి ప్రియులకు ఇది శుభవార్తే. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర.. శుక్రవారం భారీగా తగ్గింది. తాజాగా గత వారం రూ.45 వేల మార్కును దాటిన బంగారం.. క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శుక్రవారం స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలకు బ్రేకులు పడ్డట్లైంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించడంతో పాటు.. డాలరుతో రూపాయి విలువ బలపడటంతో.. ఢిల్లీలో ఫ్యూర్ గోల్డ్ (24 క్యారెట్స్) ధర.. రూ.1097 తగ్గి.. రూ.42,600కు చేరింది. అటు వెండి కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.1574 తగ్గి.. 44,130కి చేరుకుంది.

ఇక ఉదయం దేశీయంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. దీంతో కాసేపు ట్రేడింగ్ నిలిపివేసి.. ఆ తర్వాత ప్రారంభించారు. అప్పటి నుంచి మార్కెట్లు మళ్లీ పుంజుకోవడంతో పాటుగా.. ద్రవ్య లభ్యత విషయంలో ఆర్‌బీఐ కల్పించుకోవడంతో రూపాయికి కలిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,584 డాలర్లు ఉండగా .. వెండి ధర 15.65 డాలర్లుగా ఉంది. మొత్తానికి రూ.50వేలకు పరుగెడుతుందనుకుని భయపడ్డ పసిడి ప్రియులకు.. ధరలు తగ్గుతుండటం కాస్త ఊరటనిచ్చింది.