మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. కామెక్స్‌లో వరుసగా రెండో రోజు బలపడిన బంగారం, వెండి ధరలు

|

Dec 08, 2020 | 2:59 PM

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 192 రూపాయలు పెరిగి రూ. 50,138 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50,175 వద్ద గరిష్టాన్ని తాకింది.

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. కామెక్స్‌లో వరుసగా రెండో రోజు బలపడిన బంగారం, వెండి ధరలు
Follow us on

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 192 రూపాయలు పెరిగి రూ. 50,138 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50,175 వద్ద గరిష్టాన్ని తాకింది. వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ సైతం స్వల్పంగా రూ. 67 కు బలపడింది. మొదట ఇది రూ. 65,666 వద్ద గరిష్టానికి చేరింది. వెండి తదుపరి రూ. 65,363 వరకూ వెనకడుగు వేసింది. అలాగే న్యూయార్క్‌ కామెక్స్‌లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్‌ (31.1 గ్రాములు) 0.45 శాతం పుంజుకుని 1,874 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం లాభంతో 1,870 డాలర్లను అధిగమించింది. వెండి కూడా 0.2 శాతం లాభంతో 24.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.