ఏదో ఒకరోజు నన్నూ చంపేస్తారు.. ఎంఐఎం చీఫ్ సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Aug 15, 2019 | 8:30 PM

ఏదో ఒక రోజు నన్నూ చంపేస్తారంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.  ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న తనను గాడ్సే వారసులు తనను లేకుండా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ మొదటినుంచి ఒకటే చెబుతున్నామని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందుకు తనను కూడా చంపేస్తారన్నారు. ఈ […]

ఏదో ఒకరోజు నన్నూ చంపేస్తారు.. ఎంఐఎం చీఫ్  సంచలన వ్యాఖ్యలు
Follow us on

ఏదో ఒక రోజు నన్నూ చంపేస్తారంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.  ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న తనను గాడ్సే వారసులు తనను లేకుండా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ మొదటినుంచి ఒకటే చెబుతున్నామని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందుకు తనను కూడా చంపేస్తారన్నారు. ఈ దేశంలో గాంధీనే చంపిన వారికి.. ఓవైసీని చంపడం పెద్ద విషయం కాదన్నారు. దేశంలో మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం తాను ప్రాణత్యాగానికి సైతం సిద్ధమన్నారు ఓవైసీ.

రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుకోకుండా జమ్మూ కశ్మీర్‌ను విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సింది కాదన్నారు ఓవైసీ. ఆర్టికల్ 370ని రద్దు చేసి, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తాను వ్యతిరేకిస్తూనే ఉంటానన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయని, అక్కడ కర్ఫ్యూని తొలగించి, నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాడ్ చేశారు. కుటుంబ సభ్యులతో కనీసం మాట్లాడుకోకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైసీ.