ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

హైదరాబాద్ నాగోల్‌లో విషాదం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి  మరణాన్ని తట్టుకోలేక  ఓ యువతి  ఉరేసుకొని ఆత్మహత్య  చేసుకుంది.

ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య
Ram Naramaneni

|

Oct 31, 2020 | 7:00 PM

హైదరాబాద్ నాగోల్‌లో విషాదం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి  మరణాన్ని తట్టుకోలేక  ఓ యువతి  ఉరేసుకొని ఆత్మహత్య  చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన యువతి హైదరాబాద్‌లో నివాసముంటుంది. ఈ క్రమంలో  స్థానిక యువకుడిని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మ్యారేజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అయితే విధి వీరి జీవితాలతో ఆడుకుంది. మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా… ప్రియుడు కరెంట్ షాక్‌తో ప్రాణాలు విడిచాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి .. శుక్రవారం ఆత్మహత్య చేసుకుని తన మజిలీ ముగించింది. ఎల్బీనగర్‌ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన సుస్మిత (23) పారిపోయి హైదరాబాద్‌కు వచ్చి బోడుప్పల్‌లోని హాస్టల్‌లో ఉంటోంది. నాగోలు సమీప మల్లికార్జుననగర్‌కు చెందిన కల్యాణ్‌తో ఈమెకు పరిచయం ఏర్పడిందది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడయ్యారు. ఇంట్లో ఉన్న పెద్దల్ని కూడా ఒప్పించారు. పెద్దల సమ్మతితో ఈ జంట ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. పెళ్లి తేదీని నిర్ణయించారు. అయితే మరో రెండ్రోజుల్లో పెళ్లి అనగా.. విద్యుదాఘాతంతో కల్యాణ్‌ చనిపోయాడు. దీంతో సుస్మిత మనసులో అలజడి చెలరేగింది. రెండేళ్ల క్రితమే కల్యాణ్‌ తల్లి మరణించగా.. ధైర్యం కోసం అతని తండ్రితోపాటు అదే ఇంట్లో ఉంటూ కల్యాణ్‌ ఆలోచనలతోనే గడపసాగింది. ఆమె ప్రియుడి ఆలోచనల నుంచి బయలకు రాలేకపోయింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చీరతో ఉరేసుకొంది. ఎల్బీనగర్‌ పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు.

Also Read :

ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన బోధన్ పట్టణ సీఐ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu