సెల్‌ఫోన్ ఇవ్వలేదని.. 15 ఏళ్ల కూతురు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. త‌ల్లి త‌న‌కు ఫోన్ ఇవ్వ‌లేదంటూ 15ఏళ్ల బాలిక ఆత్మ‌హత్య పాల్పడింది. రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన కంకణాల సింధుజ(15) అనే బాలిక తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది.

సెల్‌ఫోన్ ఇవ్వలేదని..  15 ఏళ్ల కూతురు ఆత్మహత్య

Updated on: Aug 24, 2020 | 5:43 PM

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. త‌ల్లి త‌న‌కు ఫోన్ ఇవ్వ‌లేదంటూ 15ఏళ్ల బాలిక ఆత్మ‌హత్య పాల్పడింది. రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన కంకణాల సింధుజ(15) అనే బాలిక తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. ఎన్టీపీసీకి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్‌ సుమారు పన్నెండేళ్ల కిందట మృతి చెందాడు. ఆతర్వాత రజిత సూరు రవికిరణ్‌ను వివాహం చేసుకుంది. సుధాకర్‌ తరపున బంధువులు ఎవరూ లేకపోవటంతో సింధుజ తల్లితోనే కృష్ణానగర్‌లో ఉంటోంది. ఇటీవల పాఠశాలలో 10వ తరగతికి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించటంతో అప్పుడప్పుడు సింధుజ మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ క్లాసులు వింటోంది. దీంతో తల్లి వద్ద ఉన్న సెల్ ఫోన్ నే వాడుకుంటోంది సింధుజ. అయితే, తనకు ప్రత్యేకంగా సెల్ ఫోన్ కావాలని పట్టుబట్టింది సింధుజ. అడిగినప్పుడు తల్లి సెల్ ఫోన్ ఇవ్వడం లేదని దివ్యాంగురాలైన సింధుజ మానసికంగా కుంగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సింధుజ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. స్థానికులు సమాచారం మేరకు ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎన్టీపీసీ పోలీసులు విచారణ చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us