జీహెచ్ఎంసీలో వెలుగులోకి వస్తున్న అక్రమాలు.. ఇష్టారాజ్యంగా రోహింగ్యలకు గుర్తింపు కార్డులు ఇస్తోన్న వైనం.

కొందరు జీఎహెచ్ఎంసీ అధికారులు చట్ట వ్యతిరేక చర్యలు చేపడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. శరణార్థులుగా వచ్చిన రోహింగ్యలకు ఇష్టం వచ్చినట్లు దృవ‌ప‌త్రాలు జారీ చేస్తున్నారు.

జీహెచ్ఎంసీలో వెలుగులోకి వస్తున్న అక్రమాలు.. ఇష్టారాజ్యంగా రోహింగ్యలకు గుర్తింపు కార్డులు ఇస్తోన్న వైనం.

Updated on: Dec 20, 2020 | 4:55 PM

GHMC issuing identity cards to Rohingyas: కొందరు జీఎహెచ్ఎంసీ అధికారులు చట్ట వ్యతిరేక చర్యలు చేపడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. శరణార్థులుగా వచ్చిన రోహింగ్యలకు ఇష్టం వచ్చినట్లు దృవ‌ప‌త్రాలు జారీ చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఇప్పటికే రోహింగ్యలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎన్ఐఎ కూడా పలు కేసుల్లో దర్యాప్తు చేపడుతోన్న తరుణంలో కూడా కొందరు బల్దియా అధికారులు తమ చేతి వాటం చూపించడం మాత్రం ఆపట్లేదు. గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ పలువురు జీహెచ్ఎంసీ సిబ్బంది అడ్డంగా దొరికారు. అయినా కూడా ఈ అక్రమ దందా మాత్రం కొనసాగుతూనే ఉంది.
మరీ ముఖ్యంగా సౌత్ జోన్‌లో రొహింగ్యలకు సర్టిఫికేట్స్ జారీ యధేశ్చగా సాగిపోతోంది. అధికారులు జారీ చేస్తోన్న ఈ పత్రాలతో రొహింగ్యాలు హైదరాబాద్‌లో ఎంచక్కా గుర్తింపు కార్డులను పొందుతున్నారు. సౌత్ జోన్ జీహెచ్ఎంసీ సర్కిల్ 6లో పలువురు మీసేవ వారితో చేతులు కలిపి ఈ అక్రమ దందా చేస్తున్నారు.