Hyderabad: నగరంలో ఫ్లెక్సీలు.. మంత్రి తలసానికి రూ.50వేలు ఫైన్

|

Apr 28, 2022 | 1:53 PM

అధికార టీఆర్(TRS) ప్లీనరీ సంబరాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ...

Hyderabad: నగరంలో ఫ్లెక్సీలు.. మంత్రి తలసానికి రూ.50వేలు ఫైన్
Follow us on

అధికార టీఆర్(TRS) ప్లీనరీ సంబరాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రోడ్లు కనిపించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేల్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్(Minister Talasani Srinvias Yadav) కు రూ.50వేలు ఫైన్ విధించింది. మంత్రితో పాటు మరో ముగ్గురికి కూడా జరిమానా విధించినట్లు ప్రకటించింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ కు 40వేల రూపాయల జరిమానా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కు 5వేల రూపాయలు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ కు 10వేల రూపాయల ఫైన్ విధించింది. నగరంలో భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేయకూడదని..అలా చేస్తే తొలగించాల్సిందేనంటూ స్వయానా మంత్రి కేటీఆర్‌ ఆదేశించిన విషయాన్ని మర్చిపోయారా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని బీజేపీ గత మూడ్రోజుల నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉంది. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. పబ్లిక్ స్థలాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కారణంగా ప్రజలకు, ట్రాఫిక్‌కి ఇబ్బందికరంగా మారాయంటూ మరోసారి బుధవారం సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై కేఏ పాల్ మండిపడ్డారు. సిటీ మొత్తం గులాబీమయంగా మారిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లెక్సీలు, కటౌట్ పెట్టడానికి నియమ, నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై పిటిషన్‌లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Health Tips: బలహీనమైన నరాల కారణంగా గుండెపోటు.. ఈ అలవాట్లు కచ్చితంగా పాటించండి..!

మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. మీ డైట్ లో బెల్లం ఉందో లేదో చూసుకోండి