గ్రేటర్‌ ఎన్నికల సంరంభం : అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని హడావుడి..చార్‌సౌ షహర్‌లోని గల్లీల్లో పబ్లిక్ టాక్.!

|

Nov 20, 2020 | 1:21 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు చూస్తోంటే అసెంబ్లీ ఎన్నికలకు తీసిపోని హడావుడి కనిపిస్తోంది. కార్పొరేటర్‌ అభ్యర్థి వెంటఉండే బలగం, ఆర్భాటం, హంగామా చూస్తే మతిపోతుంది. హైదరాబాద్‌ కార్పొరేటర్‌కు అంత సీన్‌ ఉందా అనుకుంటున్నారా? అవును. కార్పొరేటర్‌కుండే సీన్‌ మామూలుగా ఉండదు. కార్పొరేటర్‌ అంటే ప్రజలకు, జీహెచ్ఎంసీ కు ఒక వారధి. స్థానిక సమస్యలను పరిష్కారంలో ముందుండే ప్రతినిధి. క్షేత్రస్థాయిలో కీలకమైన నాయకుడు. నీళ్ల రాకున్నా, కరెంట్‌ ఇబ్బందులున్నా, డ్రైనేజీ పరేషాన్‌ ఉన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా- బస్తీజనం […]

గ్రేటర్‌ ఎన్నికల సంరంభం : అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని హడావుడి..చార్‌సౌ షహర్‌లోని గల్లీల్లో పబ్లిక్ టాక్.!
Follow us on

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు చూస్తోంటే అసెంబ్లీ ఎన్నికలకు తీసిపోని హడావుడి కనిపిస్తోంది. కార్పొరేటర్‌ అభ్యర్థి వెంటఉండే బలగం, ఆర్భాటం, హంగామా చూస్తే మతిపోతుంది. హైదరాబాద్‌ కార్పొరేటర్‌కు అంత సీన్‌ ఉందా అనుకుంటున్నారా? అవును. కార్పొరేటర్‌కుండే సీన్‌ మామూలుగా ఉండదు. కార్పొరేటర్‌ అంటే ప్రజలకు, జీహెచ్ఎంసీ కు ఒక వారధి. స్థానిక సమస్యలను పరిష్కారంలో ముందుండే ప్రతినిధి. క్షేత్రస్థాయిలో కీలకమైన నాయకుడు. నీళ్ల రాకున్నా, కరెంట్‌ ఇబ్బందులున్నా, డ్రైనేజీ పరేషాన్‌ ఉన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా- బస్తీజనం కార్పొరేటర్‌ వైపు చూస్తుంటారు. కానీ ఇదంతా కాగితాల మీద రాసుకునేందుకు, తెలియనివారికి చెప్పుకునేందుకే. హైదరాబాద్‌ కార్పొరేటర్లలో చాలామంది ఈ బాధ్యతను పక్కనబెట్టి, వసూల్‌రాజాలు అయ్యారని విమర్శలు వస్తున్నాయి. కార్పొరేటర్‌ కావాలనుకుంటే కోటి నుంచి 3 కోట్లు ఖర్చుపెట్టాలి. అంటే కార్పొరేటర్‌ అభ్యర్థి స్వయంగా కోటీశ్వరుడైనా అయ్యుండాలి. లేక అంత డబ్బు సమకూర్చుకునే స్తోమతైనా ఉండాలి. లేకపోతే అంతేసంగతులన్న నిఖార్సయిన నిజమన్నది చార్‌సౌ షహర్‌లోని గల్లీల్లో వినిపిస్తోన్న టాక్‌.