GHMC Elections: హఫీజ్ పెట్ లో ఉద్రిక్త వాతావరణం.. టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది.అయితే పోలింగ్ సమయంలో హఫీజ్ పేట డివిజన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

GHMC Elections: హఫీజ్ పెట్ లో ఉద్రిక్త వాతావరణం.. టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 10:35 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది.అయితే పోలింగ్ సమయంలో హఫీజ్ పేట డివిజన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీ అభ్యర్థి ఫోటోలు ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. దీనిపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఇరువర్గాలమద్యం ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపైఒకరు దూషణలు చేసుకోవడంతో తీవ్రమైన తోపులాటకు దారితీసింది. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్షీలు తొలగించడంతో బీజేపీ కార్యకర్తలు శాంతించారు. ఇక ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.