అదే ‘సేవ్ టెంపుల్ భారత్’ చిరకాల వాంఛ: గజల్ శ్రీనివాస్
తిరుపతిలో వకుళమాత ఆలయ నిర్మాణం ‘సేవ్ టెంపుల్ భారత్’ చిరకాల వాంఛ అని గజల్ శ్రీనివాస్ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో వకుళమాత ఆలయ నిర్మాణానికి రూపకల్పన జరుగుతుండటంపై చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో టీటీడీ చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు […]
తిరుపతిలో వకుళమాత ఆలయ నిర్మాణం ‘సేవ్ టెంపుల్ భారత్’ చిరకాల వాంఛ అని గజల్ శ్రీనివాస్ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో వకుళమాత ఆలయ నిర్మాణానికి రూపకల్పన జరుగుతుండటంపై చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో టీటీడీ చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. కాగా, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత గజల్ అరుదుగా మీడియా ముందుకొస్తున్నారు.