భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద.. రూ. 63 లక్షల గంజాయి పట్టివేత..!

| Edited By:

Aug 06, 2020 | 6:31 PM

భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద జరిపిన వాహ‌న త‌నిఖీల్లో దాదాపు రూ. 63 ల‌క్ష‌ల విలువైన గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. కేసు వివ‌రాల‌ను భ‌ద్రాచ‌లం ఏఎస్పీ రాజేష్ చంద్ర వెల్ల‌డించారు. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద

భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద.. రూ. 63 లక్షల గంజాయి పట్టివేత..!
Follow us on

భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద జరిపిన వాహ‌న త‌నిఖీల్లో దాదాపు రూ. 63 ల‌క్ష‌ల విలువైన గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. కేసు వివ‌రాల‌ను భ‌ద్రాచ‌లం ఏఎస్పీ రాజేష్ చంద్ర వెల్ల‌డించారు. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం టౌన్ ఎస్ఐ మహేష్ త‌న‌ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రెండు వాహ‌నాల్లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 418 కిలోల‌ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను సంగారెడ్డి జిల్లా నారాయ‌ణఖేడ్‌కు చెందిన రాథోడ్ ప్రేమ్‌, చ‌వాన్ ర‌మేష్‌గా గుర్తించారు. సీజ్ చేసిన‌ గంజాయి విలువ రూ. 62 లక్షల 73 వేలుగా స‌మాచారం.

కాగా.. గత 45 రోజుల్లో భద్రాచలం పట్టణ పోలీసులు 14 గంజాయి కేసులను ప‌ట్టుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ చేసే రెండు వేల కేజీల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. భద్రాచలం పట్టణంలో 24 గంటలు చెక్ పోస్ట్ పెట్టి వాహనాలు తనిఖీ నిర్వహించి గంజాయి, ఇతర నిషేధిత సామాగ్రి రవాణా కాకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా అనైతిక కార్య‌క‌లాపాల‌పై సమాచారం ఉంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!