సహజీవనం పేరిట బడా బాబులకు ఎర.. అమ్మాయిలను సరఫరా చేస్తాం అంటూ నిలువుదోపిడీ చేస్తున్న ముఠా..

|

Nov 20, 2020 | 6:22 PM

సహజీవనానికి అమ్మాయిలను సరఫరా చేస్తాం అంటూ హైదరాబాద్ నగరంలోకి ఓ కొత్త ముఠా దిగింది.. బడా బాబులకు టోకరా వేస్తూ బాగా డబ్చులు గుంజుతోంది..

సహజీవనం పేరిట బడా బాబులకు ఎర.. అమ్మాయిలను సరఫరా చేస్తాం అంటూ నిలువుదోపిడీ చేస్తున్న ముఠా..
Follow us on

సహజీవనానికి అమ్మాయిలను సరఫరా చేస్తాం అంటూ హైదరాబాద్ నగరంలోకి ఓ కొత్త ముఠా దిగింది.. బడా బాబులకు టోకరా వేస్తూ బాగా డబ్చులు గుంజుతోంది.. ఆన్‌లైన్‌లో డేటింగ్ యాప్‌ల పేరిట మోసాలకు తెగబడుతోంది.. పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన ఈ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..పశ్చిమబెంగాల్‌కు చెందిన సంతూదాస్ అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలో 35 టెలీకాలర్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ దందా కొనసాగిస్తున్నాడు. తన ముఠా సభ్యులతో టెలీకాలర్ కేంద్రాలను మెయింటేన్ చేస్తూ మోసాలు చేస్తున్నాడు. యువకులకు, డబ్బున్నబడా బాబులకు అందమైన అమ్మాయిలను ఎరగా వేసి అందినకాడికి దండుకుంటున్నాడు.. ఆన్‌లైన్‌లో డేటింగ్ యాప్‌ల ద్వారా మాటలు కలిపి, మభ్యపెట్టి నట్టేట ముంచుతున్నాడు.

ఇటీవల నగరానికి చెందిన ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ. 13.8 లక్షలు వసూలు చేశారు. అదే విధంగా షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి నుంచి రూ. లక్ష వరకు కాజేశారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు కాల్ సెంటర్‌లపై దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా ప్రధాన నిందితుడితో పాటుగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి ల్యాప్ టాప్‌లు, 31 సెల్‌ఫోన్లు, 12 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ డేటింగ్ అప్లికేషన్లను సంప్రదించవద్దని సూచించారు. అలాగే ఎవరూ కూడా వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.