కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్న తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్.. ఈసారి ఆన్‌లైన్‌లో.

తెలంగాణాలో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల కోసం పోటీపడుతోన్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త తెలిపింది. రాత పరీక్ష కోసం సిద్ధమవుతోన్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు స్టడీ సర్కిల్ తెలిపింది.

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్న తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్.. ఈసారి ఆన్‌లైన్‌లో.

Updated on: Dec 23, 2020 | 4:02 PM

Free coaching for police candidates: తెలంగాణాలో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల కోసం పోటీపడుతోన్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త తెలిపింది. రాత పరీక్ష కోసం సిద్ధమవుతోన్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు స్టడీ సర్కిల్ తెలిపింది. ఈ విషయమై తాజాగా బీసీ స్టడీ సర్కిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రతీ ఏటా తరగతి గదుల్లో ఇచ్చే శిక్షణను ఈసారి కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ ఉచిత శిక్షణ పట్ల ఆసక్తికలిగిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు tsbcstudycircle. cgg.gov.in నుంచి ఫారం డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ సూచించింది. ఇక ఉచిత శిక్షణ పొందడానికి గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.2లక్షలు మించకూడదని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040-24071178, 63024 27521 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.