మాజీ ఐఎఎస్ గా చెలామణి.. మాయలేడీ అరెస్ట్

|

Aug 11, 2020 | 12:15 PM

మాజీ అధికారిణీగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళ భాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిణి సుజాతరావుగా తనను పరిచయం చేసుకుంటూ ప్రజల నుంచి నగదు వసూలుకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ఫ్లాన్ తో ఆ మహిళను కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ ఐఎఎస్ గా చెలామణి.. మాయలేడీ అరెస్ట్
Follow us on

మాజీ అధికారిణీగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళ భాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిణి సుజాతరావుగా తనను పరిచయం చేసుకుంటూ ప్రజల నుంచి నగదు వసూలుకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ఫ్లాన్ తో ఆ మహిళను కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఈనెల ఏడో తేదీన హనుమాన్‌జంక్షన్‌లో వైసీపీ నాయకుడు దుట్టా రామచంద్రరావుకు చెందిన సీతామహాలక్ష్మి నర్సింగ్‌ హోంకు 60 ఏళ్ల వయసు పైబడిన మహిళ కారులో వచ్చింది. తాను రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిణీ సుజాతరావుగా పరిచయం చేసుకుంది. ప్రస్తుతం ఆరోగ్య కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నట్లు సిబ్బందికి తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైద్యుని పేరిట గరుడ పూజ చేయిస్తానని, ఇందుకోసం రూ.3,500 నగదు ఇవ్వమని అడిగింది. అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది రామచంద్రరావు కుమారుడు రవిశంకర్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. తాను వచ్చే వరకు ఆమెను అక్కడే ఉంచాలని ఆయన సూచించారు. అయితే, గడుస్తుండడంతో అనుమానం వచ్చిన సదరు మహిళ పలాయనం చిత్తగించింది. సుజాతరావు పేరిట వచ్చిన మహిళ మోసకారి అని, గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు నిర్ధరించుకున్న రామచంద్రారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న నూజివీడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

డీఎస్పీ బి.శ్రీనివాసులు నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పెమ్మడి విజయలక్ష్మిగా గుర్తించారు. పక్కా ప్రణాళికతో సోమవారం విజయలక్ష్మీని అరెస్టు చేశారు. ఆమె తిరిగేందుకు ఉపయోగిస్తున్న అద్దె కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కారు డ్రైవర్‌కు కూడా మాయమాటలు చెప్పి నమ్మించిందని, ప్రస్తుతం విజయవాడలో అతనికి చెందిన గదిలోనే ఉంటోందని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు.సెక్షన్‌ 419, 420 రెడ్‌విత్‌ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశామన్నారు.