ఫ్రాన్స్‌లో కరోనా మృత్యుహేల.. 20 వేల మంది మృతి..

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి 1.66 లక్షలకు పైగా జనం  మరణించారు. ఫ్రాన్స్‌లో కరోనా

ఫ్రాన్స్‌లో కరోనా మృత్యుహేల.. 20 వేల మంది మృతి..

Edited By:

Updated on: Apr 21, 2020 | 4:55 PM

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి 1.66 లక్షలకు పైగా జనం  మరణించారు. ఫ్రాన్స్‌లో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 20 వేలు దాటింది. ఫ్రాన్స్‌లో సోమవారం కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో 547 మంది మరణించారు. దీనితో  దేశవ్యాప్తంగా వైరస్ కారణంగా 20,000 మందికి పైగా మరణించినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది.

కాగా.. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు కోవిడ్ -19 బారిన పడి  20,265 మంది మరణించారని టాప్ హెల్త్ ఆఫీసర్ జెరోమ్ సలోమన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన అమెరికా, ఇటలీ, స్పెయిన్ ల తరువాత ఫ్రాన్స్ నాల్గవ దేశంగా నిలిచింది.  ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో ఎక్కువగా కనిపించింది. ఇక్కడ కోవిద్ -19 మరణాల సంఖ్య 40,683 కు పెరిగింది.

Also Read: కరోనా ఎఫెక్ట్: దాడులకు నిరసనగా.. 23న బ్లాక్ డే: ఐఎంఏ