Akhila Priya Remand: బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసుః మాజీ మంత్రి అఖిలప్రియకు14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ మహిళా జైలుకు తరలింపు

|

Jan 06, 2021 | 9:07 PM

బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలు ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Akhila Priya Remand: బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసుః మాజీ మంత్రి అఖిలప్రియకు14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ మహిళా జైలుకు తరలింపు
Follow us on

14 days remand for Akhila Priya: తెలుగు రాష్ట్రాల్లో సంచల‌నం సృష్టించిన బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలు ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. నిన్న రాత్రి ప్రవీణ్‌రావు ఆయన సోదరులు సునీల్‌, నవీన్‌లు కిడ్నాప్‌కు గురయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి కేసును ఛేదించారు. కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా ఏపీ మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌, ఏ3గా భార్గవ్ రామ్ ఉన్నారు. అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపర్చారు. దీంతో అఖిల ప్రియను14 రోజుల పాటు జ్యుడీషియల్ రీమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం న్యాయమూర్తి నివాసం నుండి అఖిలప్రియను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు..
.
మంగళవారం రాత్రి 11గంటల ప్రాంతంలో సినీ పక్కీలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు మూడు గంట‌ల్లోనే చేధించారు. ఏ1, ఏ2 నిందితుల‌ను అరెస్టు చేసిన పోలీసులు ఏ3 నిందితుడు, అఖిల‌ప్రియ భ‌ర్త భార్గవ్‌రామ్ కోసం గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. కిడ్నాప్‌పై పోలీసుల ద‌ర్యాప్తు ప్రారంభం కాగానే భార్గవ్‌రామ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆచూకీ కోసం సీసీ కెమెరా ఫుటేజీల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి….Bhuma Akhila Priya Arrest: భూమా అఖిలప్రియ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న బోయిన్‌పల్లి పోలీసు