తీవ్ర విషాదం..చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి

|

Nov 21, 2020 | 1:57 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా  నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో తీవ్ర వీషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి ఒకే ఫ్యామిలీకిి చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

తీవ్ర విషాదం..చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి
Crime News
Follow us on

మహబూబ్‌నగర్‌ జిల్లా  నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో తీవ్ర వీషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి ఒకే ఫ్యామిలీకిి చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొగల్ మడక  గ్రామ పంచాయతీ పరిధిలోని నంద్యా నాయక్‌ తండాలో శుక్రవారం  సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. .. నంద్యానాయక్ తండాకు చెందిన ఓ వృద్ధుడు గురువారం హైదరాబాద్‌లో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని సొంతూరుకు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలు ముగిసిన అనంతరం మృతుడి మనువళ్లైన ఐదుగురు పిల్లలు స్నానం చేసేందుకు దగ్గర్లోని చెరువు వద్దకు వెళ్లారు.

అయితే లోతు ఎక్కువగా ఉండటం, ఈత రాకపోవడంతో  చెరువులోకి దిగిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు నీట మునిగారు. వీరితో వెళ్లిన మరో బాలుడు ఒడ్డునే ఉండటంతో వెంటనే తండాకు వచ్చి స్థానికులకు విషయం చెప్పాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా అప్పటికే చిన్నారులు మృతి చెంది..నీటిపై తేలుతూ కనిపించారు. మృతులను అరుణ్‌ నాయక్ (11), అర్జున్‌ నాయక్(13), గణేశ్ నాయక్ (12), ప్రవీణ్‌ నాయక్ (12)  గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి తన ఇద్దరు తనయులను కోల్పోవడంతో ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు చనిపోవడంతో తండాలో తీవ్ర విషాదం నెలకుంది.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్

.