మాజీ మంత్రి కొడుకు మామూలోడు కాడు!

| Edited By:

Dec 16, 2019 | 7:39 PM

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు, అతడి ముగ్గురు స్నేహితులు ఓ కారులో బీచ్‌ రోడ్‌లో వెళ్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న వారి కారు డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి.. ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి గాయాలు కాగా.. కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్పలనాయుడిని నిలదీయగా అతను వారితో గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అతడిపై చేయిచేసుకున్నారు. తరువాత అప్పలనాయుడు, అతని స్నేహితులు అక్కడి […]

మాజీ మంత్రి కొడుకు మామూలోడు కాడు!
Follow us on

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు, అతడి ముగ్గురు స్నేహితులు ఓ కారులో బీచ్‌ రోడ్‌లో వెళ్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న వారి కారు డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి.. ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి గాయాలు కాగా.. కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్పలనాయుడిని నిలదీయగా అతను వారితో గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అతడిపై చేయిచేసుకున్నారు. తరువాత అప్పలనాయుడు, అతని స్నేహితులు అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా తన కారు నెంబర్‌ ప్లేట్ ను మార్చేందుకు అప్పలనాయుడు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. ఆ కారుకి ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు ఉండగా.. ఆ స్థానంలో ఏపీ 37 సీవీ 0780 నంబరు ప్లేటు అమర్చేందుకు యత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా మళ్లీ పాత నంబరు ప్లేటు దర్శనమిచ్చింది.

గతంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి నారాయణ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నిశిత్ నారాయణ(22)తో పాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ(23) మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ ఎస్‌యూవీ బెంజ్ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు బాబు మోహన్ కొడుకు కూడా చిన్న పాపని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు. బాబు మోహన్ తనయుడు పవన్ కుమార్ 2003 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఓ చిన్న పాప బైక్‌కు సడెన్‌గా అడ్డం రావడంతో, ఆ పాపను తప్పించబోయి డివైడర్‌కు ఢీ కొట్టాడు. దీంతో పవన్ ఆ ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు.