కేసుల వ్యవహారం పై కోడెల రియాక్ట్..!

గత కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యులపై నమోదవుతున్న కేసుల వ్యవహారం పై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని.. విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగానే ఉన్నామని చెప్పారు. తన పరువును తీయడానికే ఇలా చేస్తున్నారని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించడం సరికాదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదా, పోలవరం, కరువు పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని కోడెల సూచించారు. […]

కేసుల వ్యవహారం పై కోడెల రియాక్ట్..!

Edited By:

Updated on: Jun 17, 2019 | 5:25 PM

గత కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యులపై నమోదవుతున్న కేసుల వ్యవహారం పై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని.. విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగానే ఉన్నామని చెప్పారు. తన పరువును తీయడానికే ఇలా చేస్తున్నారని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ కార్యకర్తలను వేధించడం సరికాదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదా, పోలవరం, కరువు పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని కోడెల సూచించారు. విజయసాయిరెడ్డ ప్రోత్సాహంతోనే ఈ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచివి కాదని.. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పరిపాలన జరగాలని కోడెల అభిప్రాయపడ్డారు.

Loading...
Unable to load recommendations.
Follow Us