ర‌క్ష‌ణ రంగంలోకి ఎఫ్‌డీఐ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం…

|

Sep 18, 2020 | 1:30 PM

ర‌క్ష‌ణ రంగంలోకి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను అనుమ‌తి ఇస్తూ ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యాన్ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ స్వాగ‌తించారు. ర‌క్ష‌ణ రంగంలోకి 74 శాతం...

ర‌క్ష‌ణ రంగంలోకి ఎఫ్‌డీఐ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం...
Follow us on

ర‌క్ష‌ణ రంగంలోకి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను అనుమ‌తి ఇస్తూ ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యాన్ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ స్వాగ‌తించారు. ర‌క్ష‌ణ రంగంలోకి 74 శాతం ఎఫ్‌డీఐ(FDI)ని ఆటోమెటిక్ రూట్లో, 74 శాతం దాటిన ఎఫ్‌డీఐకి ప్ర‌భుత్వ రూట్లో అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఈ విష‌యంపై మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ర‌క్ష‌ణ‌రంగంలో ఎఫ్‌డీఐ వ‌ల్ల వాణిజ్యం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని, ఇది పెట్టుబ‌డుల వృద్ధికి, ఆదాయానికి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు దారి తీస్తుంద‌ని మంత్రి అన్నారు. జాతీయ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల ఆధారంగానే ర‌క్ష‌ణ రంగంలోకి విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎఫ్‌డీఐ స‌వ‌ర‌ణ వ‌ల్ల ర‌క్ష‌ణ రంగం స్వ‌యం స‌మృద్ధిగా మారుతుంద‌న్నారు. జాతీయ ప్ర‌యోజ‌నాలు, భ‌ద్ర‌త‌కు ప్రాముఖ్య‌త ఇస్తూనే ఎఫ్‌డీఐల‌ను ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలిపారు.