అమెరికాలో ఆ మహిళకు మరణ శిక్ష అమలు, ఏడు దశాబ్దాల అనంతరం మళ్ళీ, ఆమె ఏం చేసిందంటే ?

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2021 | 1:08 PM

అమెరికాలో దారుణ నేరానికి పాల్పడిన ఓ మహిళకు మరణ శిక్షను అమలుపరిచారు. లీసా మాంటెగ్ మరీ అనే ఈ మహిళకు డెత్ పెనాల్టీ..

అమెరికాలో ఆ మహిళకు మరణ శిక్ష అమలు, ఏడు దశాబ్దాల అనంతరం మళ్ళీ, ఆమె ఏం చేసిందంటే ?
Follow us on

అమెరికాలో దారుణ నేరానికి పాల్పడిన ఓ మహిళకు మరణ శిక్షను అమలుపరిచారు. లీసా మాంటెగ్ మరీ అనే ఈ మహిళకు డెత్ పెనాల్టీ ని అమలుపరచరాదని, స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన అన్ని అభ్యర్థనలనూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇండియానాలోని ఓ జైలు గదిలో విషపూరితమైన ఇంజెక్షన్ ఇవ్వడంద్వారా లీసా కు డెత్ పెనాల్టీ అమలు చేశారు. 2007 లో ఈమె..మిస్సోరీలో బాబీ అనే 8 నెలల గర్భిణీ ని గొంతు నులిమి చంపి చురకత్తితో  ఆమె గర్భాశయం నుంచి పిండాన్ని దొంగిలించింది. అయితే ఆ శిశువు బతికే ఉంది. తన క్లయింటుకు క్షమా బిక్ష పెట్టాలని, యావజీవ ఖైదు విధించాలని లీసా తరఫు లాయర్ కోర్టును కోరారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఇంత దారుణ నేరం చేసిన మహిళకు మరణ శిక్షే సమంజసమని కోర్టు అభిప్రాయపడింది.

52 ఏళ్ళ లీసా నలుగురు పిల్లల తల్లి కూడా.. 1953 లో అమెరికాలో ఓ మహిళా ఖైదీకి ఉరిశిక్ష విధించారు.మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఓ మహిళకు మరణశిక్షను అమలుపరచడం ఇదే మొదటిసారి.

 

Also Read:

మరోసారి బెంగాల్ పర్యటనకు కేంద్ర మంత్రి అమిత్ షా ప్లాన్.. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..

Winter Healthy Tips: చలికాలంలో ఉసిరిని తీసుకుంటే చాలా లాభాలున్నాయంటా.. అవేంటో తెలుసుకుందామా..

మహారాష్ట్ర మంత్రిపై రేప్ అభియోగం, తోసిపుచ్చిన మినిస్టర్, కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ మహిళా విభాగం డిమాండ్