మహారాష్ట్ర మంత్రిపై రేప్ అభియోగం, తోసిపుచ్చిన మినిస్టర్, కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ మహిళా విభాగం డిమాండ్

మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే తనను రేప్ చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని..

  • Umakanth Rao
  • Publish Date - 12:26 pm, Wed, 13 January 21

మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే తనను రేప్ చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని, బాలీవుడ్ లో సింగర్ గా అవకాశం ఇప్పిస్తానని మోసగించాడని ఈ నెల 11 న ఓషివారా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 1997 నుంచి ఆయనతో తనకు సాన్నిహిత్యం ఉందని పేర్కొంది. దీనిపై రాష్ట్ర బీజేపీ మహిళా విభాగం కూడా స్పందించి ధనుంజయ్ ముండేని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే రేప్ ఆరోపణలను ముండే తోసిపుచ్చారు. 2003 నుంచి తను ఓ మహిళతో సహజీవనం చేస్తున్నానని, అంతే తప్ప ఎవరినీ రేప్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. అటు బాధితురాలి తరఫు లాయర్..ఈ మంత్రిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయలేదని ఆరోపించారు.

2008 లో తన క్లయింటుపై ముండే అత్యాచారం చేశాడని, పైగా వీడియో తీశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే దీన్ని సోషల్ మీడియాకు ఎక్కిస్తానని బెదిరించాడని ఆ లాయర్ పేర్కొన్నారు.