మరోసారి బెంగాల్ పర్యటనకు కేంద్ర మంత్రి అమిత్ షా ప్లాన్.. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..

బెంగల్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలను అమిత్ షా చుట్టేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో జనవరి ముగిసే నాటికి నాలుగు రాష్ట్రాల్లో..

  • Sanjay Kasula
  • Publish Date - 12:51 pm, Wed, 13 January 21

Amit Shah To Visit : మరోసారి బెంగల్‌ పర్యటనకు రెడీ అవుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బెంగల్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలను అమిత్ షా చుట్టేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో జనవరి ముగిసే నాటికి నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 15 రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బంగాల్​, అసోం రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా  హాజరుకానున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

షా పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..

గుజరాత్ – జనవరి 14

కర్ణాటక – జనవరి 16, 17

అసోం – జనవరి 24

పశ్చిమ్​ బంగా – జనవరి 30,31

అసోం, బంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ -మే మధ్యకాలంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన కీలకంగా మారింది. ముఖ్యంగా బంగాల్ పై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.