సీఎం జగన్ జైత్రయాత్రకు సర్వం సిద్దం.. అప్పటి నుంచే మలివిడత ఎన్నికల ప్రచారం..

సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి రంగం సిద్దం చేసింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ రూపొందించారు వైసీపీ నాయకులు. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలతో కొత్త రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తనదైన పక్కా ప్రణాళికలతో సిద్దం, మేమంతా సిద్దం అంటూ రెండు రకాల ప్రచార యాత్రలు చేపట్టి ప్రజల్లో మమేకం అయ్యారు.

సీఎం జగన్ జైత్రయాత్రకు సర్వం సిద్దం.. అప్పటి నుంచే మలివిడత ఎన్నికల ప్రచారం..
Cm Ys Jagan
Follow us

|

Updated on: Apr 25, 2024 | 8:48 PM

సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి రంగం సిద్దం చేసింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ రూపొందించారు వైసీపీ నాయకులు. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలతో కొత్త రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తనదైన పక్కా ప్రణాళికలతో సిద్దం, మేమంతా సిద్దం అంటూ రెండు రకాల ప్రచార యాత్రలు చేపట్టి ప్రజల్లో మమేకం అయ్యారు. తన ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమం గురించి విరిస్తూ, సామన్యుల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. అయితే గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ సాయంత్రానికి తాడేపల్లి తన సొంత నివాసానికి చేరుకున్నారు. శుక్ర, శని వారాల్లో మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటీకే దీనిపై తుది కసరత్తు పూర్తి అయింది. గతంలో కంటే భిన్నంగా, మెరుగైన సంక్షేమం, అభివృద్ది చేసేలా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే మలివిడత ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది.

ఇప్పటి వరకు మేమంతా సిద్దం బస్సుయాత్ర పేరుతో దాదాపు 22 రోజుల పాటు ప్రజల్లో ఉన్న సీఎం జగన్ మరోసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. ఎప్రిల్ 28 నుంచి తన మలివిడత ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచి ప్రారంభించనున్నారు. ముందుగా తాడిపత్రి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రతి రోజు 3 బహిరంగ సభలు నిర్వహిచేలా ప్రణాళికలు రూపొందించింది వైసీపీ. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు సభల్లో పాల్గొననున్నారు. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో ప్రసంగించనున్నారు. ఇలా కేవలం 15 రోజుల్లో దాదాపు 45 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతి రోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో ఒక్కో సభ ఉండేలా రూపొందించారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..