ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్ నేత..

కడపలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూటమిలో సీట్ల సర్థుబాటులో భంగపడ్డ నేతలందరూ టీడీపీ, జనసేనను వీడి సీఎం జగన్ పార్టీలో చేరారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో దాదాపు 220పై చిలుకు నాయకులు కూటమి పార్టీల నుంచి వైసీపీలోకి చేరారు.

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్ నేత..
Ysrcp
Follow us

|

Updated on: Apr 25, 2024 | 4:32 PM

కడపలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూటమిలో సీట్ల సర్థుబాటులో భంగపడ్డ నేతలందరూ టీడీపీ, జనసేనను వీడి సీఎం జగన్ పార్టీలో చేరారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో దాదాపు 220పై చిలుకు నాయకులు కూటమి పార్టీల నుంచి వైసీపీలోకి చేరారు. ఇదే సీన్ గురువారం పులివెందులలో చోటు చేసుకుంది. నామినేషన్‌ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, కడప జిల్లాలో కీలక నేత వీరశివారెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‎లో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్‌ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందిస్తున్నారన్నారు. ఆ సంక్షేమ పథకాల్ని చూసి, సీఎం జగన్ చేసే మంచిపనికి ఆకర్షితుడినయ్యానన్నారు. అందుకే ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు.

ఇప్పటి వరకు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే మళ్లీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. వైఎస్సార్‌సీపీ తన సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా తప్పకుండా నా బాధ్యతలను విధేయతతో నిర్వహిస్తానన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదని విమర్శించారు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఏపీలో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత నెలలో టీడీపీ సీనియర్ నేత సతీష్‌ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి సతీష్ రెడ్డికి, వైఎస్ కుటుంబానికి రాజకీయ వైరం కొనసాగుతూనే ఉండేది. గతంలో రెండు సార్లు పులివెందులలో సీఎం జగన్‎కు ప్రత్యర్థిగా టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్ రెడ్డి బరిలో నిలిచేవారు. ఇంతటి సీనియర్ నేతలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!